
'ఓజీ' సీక్వెల్ చేస్తున్నాం - పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్ నటించిన 'ఓజీ' చిత్రం భారీ అంచనాల మధ్య విడుదలై ఆయన కెరీర్ లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ నేపథ్యంలో చిత్ర విజయోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ 'ఓజీ' కథ తనకు మొదట పూర్తిగా అర్థం కాలేదని తన కొడుకు అకీరా నందన్ కథను చదివి ఆనందపడటం చూసి ఈ తరం వారికి అర్థమయ్యే కథే 'ఓజీ' అని భావించానని తెలిపారు. 'ఓజీ' సీక్వెల్ లేదా ప్రీక్వెల్ చేస్తానని సుజీత్ కు మాట ఇచ్చానని అన్నారు.




