
బిగ్‌బాస్‌లో సరికొత్త చరిత్ర.. 48 గంటల్లో రూ.15 లక్షలతో మితిలేష్ అవుట్!
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో వైల్డ్ కార్డ్‌గా ప్రవేశించిన మితిలేష్, కేవలం 48 గంటల్లోనే రూ.15 లక్షల మనీ ఆఫర్‌ను స్వీకరించి, సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యాడు. 'టెంప్టేషన్ అండ్ టెన్షన్' కాన్సెప్ట్‌లో భాగంగా బిగ్‌బాస్ ఇచ్చిన ఈ భారీ క్యాష్ ఆఫర్‌ను అంగీకరించి మితిలేష్ ఇంటి నుండి బయటకు వెళ్ళాడు. గత సీజన్లలో సంపూర్ణేష్ బాబు, గంగవ్వ, నాగ మణికంఠ, రాము వంటివారు వివిధ కారణాలతో స్వచ్ఛందంగా నిష్క్రమించినప్పటికీ, ఇంత తక్కువ సమయంలో భారీ నగదుతో వైల్డ్ కార్డ్ ఎంట్రీ తీసుకున్న కంటెస్టెంట్ నిష్క్రమించడం ఇదే తొలిసారి.




