పీవీ సింధుకు గాయం.. ఈవెంట్ల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటన

14272చూసినవారు
పీవీ సింధుకు గాయం.. ఈవెంట్ల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటన
భారత బ్యాడ్మింటన్ స్టార్‌ పీవీ సింధుకు గాయం కావడంతో ఈ ఏడాది మిగిలిన అన్ని BWF టూర్ ఈవెంట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ఆమె ప్రకటించారు. యూరోపియన్ సిరీస్‌కు ముందు తగిలిన పాద గాయం పూర్తిగా నయంకాలేదని వైద్యులు సూచించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. "గాయాలు క్రీడాకారుల ప్రయాణంలో భాగం. అవి తిరిగి బలంగా ఎదగడానికి ప్రేరణగా మారుతాయి. డా. వేన్ లాంబార్డ్ పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నా. త్వరలోనే కోర్ట్‌లోకి తిరిగి వస్తా" అని సింధు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్