
మిస్ యూనివర్స్ వేదికపైకి భారత్ సుందరి కజియా లిజ్ మెజో
75వ మిస్ యూనివర్స్ పోటీల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించేందుకు మిస్ యూనివర్స్ ఇండియా కజియా లిజ్ మెజో ప్యూర్టో రికోకు బయలుదేరారు. సాంప్రదాయ మెరూన్ చీరలో ఆకట్టుకున్న ఆమె, ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రయాణమయ్యారు. ఈ పోటీలు ప్యూర్టో రికోలోని శాన్ జువాన్ నగరంలో జరగనుండగా, ఫైనల్స్ నవంబర్ 24, 2026న నిర్వహించబడతాయి. కేరళకు చెందిన కజియా, ఈ ప్రతిష్టాత్మక వేదికపై దేశం తరఫున ఆశలతో కిరీటం కోసం పోటీపడనున్నారు.




