కండోమ్‌లలో క్వాలిటీ లోపం.. ప్రెగ్నెన్సీ టెస్ట్‌ చేసుకోవాలని సూచన

10858చూసినవారు
కండోమ్‌లలో క్వాలిటీ లోపం.. ప్రెగ్నెన్సీ టెస్ట్‌ చేసుకోవాలని సూచన
ఫ్రాన్స్‌లో సుమారు 2.6 లక్షల కండోమ్‌లను అధికారులు రీకాల్ చేశారు. ల్యాబ్ పరీక్షల్లో కొన్ని కండోమ్‌లు పగిలిపోయే ప్రమాదం లేదా చిన్న రంధ్రాలు ఉండే అవకాశం ఉన్నట్లు గుర్తించారు. దీంతో యాంటీ-ఫ్రాడ్, ఆరోగ్య సంస్థలు భద్రతా హెచ్చరికలు జారీ చేశాయి. ఇప్పటికే వీటిని ఉపయోగించిన వారు లైంగికంగా సంక్రమించే వ్యాధులకు పరీక్షలు చేయించుకోవాలని, పీరియడ్స్ ఆలస్యమైతే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలని సూచించారు. ఒకమోటో ఇండస్ట్రీస్, మైల్యూబీ, ఫ్రైడే బీ తదితర బ్రాండ్లకు చెందిన ఉత్పత్తులు రీకాల్ జాబితాలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్