పిల్లుల ద్వారా రేబిస్ వ్యాప్తి: నిపుణులు

523చూసినవారు
పిల్లుల ద్వారా రేబిస్ వ్యాప్తి: నిపుణులు
నగరాల్లో పిల్లుల పెంపకం పెరుగుతున్న నేపథ్యంలో, రేబిస్ వ్యాధి పట్ల అప్రమత్తత అవసరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రేబిస్ సోకిన పిల్లులు లక్షణాలు లేకుండానే వైరస్‌ను వ్యాపింపజేయగలవని, వాటి కరవడం, గీరడం లేదా నాకడం ద్వారా మనుషుల్లోకి వైరస్ ప్రవేశించవచ్చని తెలిపారు. పెంపుడు పిల్లులకు క్రమం తప్పకుండా టీకాలు వేయించడం, బయటి పిల్లుల విషయంలో జాగ్రత్త వహించడం, అనుమానిత జంతువులు కరిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం వంటి చర్యలు తీసుకోవాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్