భారత్–ఫ్రాన్స్ మధ్య 114 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు కీలక ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. ఈ నెల చివర్లో ఫ్రాన్స్ అధ్యక్షుడు మక్రాన్ పర్యటనకు ముందు డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ దీనికి ఆమోదం తెలపనుంది. సుమారు రూ.3.25 లక్షల కోట్ల విలువైన ఈ డీల్ భారత్ చరిత్రలో అతిపెద్ద ఫైటర్ జెట్ కొనుగోళ్లలో ఒకటిగా నిలవనుంది. 18 విమానాలు నేరుగా దిగుమతి చేయగా, మిగిలినవాటిని మేక్ ఇన్ ఇండియా కింద దేశీయంగా తయారు చేస్తారు.