రాఘవ లారెన్స్ 'మహావీర కర్ణ' ఫస్ట్ లుక్ విడుదల

8071చూసినవారు
రాఘవ లారెన్స్ 'మహావీర కర్ణ' ఫస్ట్ లుక్ విడుదల
ప్రముఖ నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ మహాభారతంలోని వీరుడు కర్ణుడి పాత్రలో నటిస్తున్న 'మహావీర కర్ణ' సినిమా ఫస్ట్ లుక్ తాజాగా విడుదలైంది. పెన్ మూవీస్ ఈ పోస్టర్‌ను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. 'ఏ ఫేస్.. ఏ లెజెండ్.. ఏ వారియర్' అంటూ రాఘవ లారెన్స్‌ను మహావీర కర్ణగా పరిచయం చేశారు. పోస్టర్‌లో లారెన్స్ బంగారు కవచంతో, గంభీరమైన లుక్‌లో కనిపిస్తున్నారు. రమేశ్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పెన్ స్టూడియోస్ భారీ స్థాయిలో తెరకెక్కిస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్