యాదాద్రి జిల్లా రాజాపేట గురుకులంలో ర్యాగింగ్‌ కలకలం

18చూసినవారు
యాదాద్రి జిల్లా రాజాపేట గురుకులంలో ర్యాగింగ్‌ కలకలం
యాదాద్రి జిల్లా రాజాపేట మండలం సాంఘిక సంక్షేమ గురుకులంలో ర్యాగింగ్‌ కలకలం రేగింది. అర్ధరాత్రి పదో తరగతి విద్యార్థి కౌశిక్‌పై 20 మంది ఇంటర్‌ విద్యార్థులు దాడి చేశారు. అడ్డువచ్చిన ఐదుగురిపై కూడా కర్రలతో దాడి చేసినట్లు జూనియర్‌ విద్యార్థులు తెలిపారు. ఈ దాడిలో పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలవడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. దీంతో బాధిత తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ప్రిన్సిపల్‌, యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

సంబంధిత పోస్ట్