మెడికల్ కాలేజ్‌లో ర్యాగింగ్ కలకలం.. 14 మంది సీనియర్లపై వేటు

15చూసినవారు
మెడికల్ కాలేజ్‌లో ర్యాగింగ్ కలకలం..  14 మంది సీనియర్లపై వేటు
TG: కామారెడ్డి మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేగింది. జూనియర్లను ర్యాగింగ్ చేసిన 14 మంది సీనియర్లపై సస్పెన్షన్​ వేటు పడింది. నలుగురు సీనియర్లను అధికారులు ఆరు నెలల పాటు సస్పెండ్ చేశారు. 10 మందిని 4 నెలలు సస్పెండ్ చేశారు. ఎన్ఎంసీ యాంటీ ర్యాగింగ్ సెల్‌కు బాధిత విద్యార్థులు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేశారు. ర్యాగింగ్ జరిగినట్లు వీడియో ఆధారాలతో అధికారులు గుర్తించారు.

సంబంధిత పోస్ట్