
నర్సీపట్నంలో చింతకాయల అయ్యన్నపాత్రుడు సతీమణి గెలుపు
AP: అనకాపల్లి జిల్లా, నర్సీపట్నం మున్సిపాలిటీ ఎన్నికల్లో కూటమి ఏకపక్ష విజయాన్ని నమోదు చేసి చైర్ పర్సన్ పీఠాన్ని దక్కించుకుంది. మొత్తం 40 వార్డులకు గాను టీడీపీ 34, జనసేన 3, వైసీపీ 1, ఇతరులు 2 స్థానాల్లో గెలుపొందారు. కూటమి తరఫున పోటీ చేసిన శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సతీమణి చింతకాయల పద్మావతి తన ప్రత్యర్థిపై 11,519 ఓట్ల భారీ మెజార్టీతో రికార్డు విజయం సాధించారు. ఈ సందర్భంగా నర్సీపట్నంలో కార్యకర్తలు విజయోత్సవ ర్యాలీలు జరిపి సంబరాలు చేసుకున్నారు.




