బిహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రత్యేక శైలిలో ప్రజలతో మమేకమయ్యారు. బెగుసరాయ్ జిల్లాలో మత్స్యకారులతో కలిసి చేపల వేటలో పాల్గొన్నారు. మాజీ మంత్రి ముకేశ్ సాహ్నీతో కలిసి బోటులో చెరువులోకి వెళ్లి వల వేశారు. కాసేపటికి రాహుల్ స్వయంగా నీళ్లలోకి దిగి జాలర్లతో కలిసి చేపలు పట్టారు. మత్స్యకారుల సమస్యలు అడిగి తెలుసుకుని, వేట నిషేధిత కాలంలో కుటుంబాలకు రూ.5 వేల చొప్పున సాయం, బీమా, చేపల మార్కెట్‌లు, జలవనరుల పునరుద్ధరణ వంటి హామీలు ఇచ్చారు.