కాంగ్రెస్ నేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఢిల్లీలోని బెంగాలీ మార్కెట్ పరిధిలో గల తోరడ్‌మల్ పార్కుకు చేరుకుని ఆటో డ్రైవర్లతో ముచ్చటించారు. వారితో కలిసి సాధారణంగా కింద కూర్చుని భోజనం, నీళ్లు పంచుకుంటూ సాదాసీదాగా సంభాషించారు. ఆటో డ్రైవర్ల రోజువారీ సవాళ్లు, ఆదాయం, పెరుగుతున్న ఖర్చులు మరియు పని పరిస్థితుల గురించి అడిగి తెలుసుకుంటూ, వారి సమస్యలపై విస్తృతంగా చర్చించారు.