కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ‘సత్యాగ్రహ’ పోర్టల్‌ను ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ప్రజలు తమ సమస్యలపై చేపడుతున్న నిరసనలను ఒకే వేదికపైకి తీసుకురావడమే లక్ష్యమని తెలిపారు. జెన్‌జీ,
విద్యార్థులు, రైతులు, ఆదివాసీలు, దళితులు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను ఈ పోర్టల్‌లో నమోదు చేయాలని కోరారు. అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడుతున్న వారు తమ కథనాలను పంచుకోవాలని, వాటికి అండగా నిలవడం ప్రతిపక్ష నేతగా తన బాధ్యత అని రాహుల్ పేర్కొన్నారు.