బీహార్ డెహ్రీలో జరిగిన సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. రాహుల్‌గాంధీ ఓట్ల చోరీ ఆరోపణలను తిప్పికొట్టారు. అక్రమ ఓటర్ల తొలగింపుకే ఎన్నికల సంఘం ప్రత్యేక సవరణ చేపట్టిందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ చొరబాటుదారులకు వత్తాసు పలుకుతోందని మండిపడ్డారు. బీజేపీపై అబద్ధాలు వ్యాప్తి చేయడం తప్ప.. కాంగ్రెస్‌కు పని లేదని విమర్శించారు. రాబోయే బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.