TG: సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండల కేంద్రంలో లబ్ధిదారులకు రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాబోతున్నారని అన్నారు. అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి రేషన్ కార్డు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, నాణ్యమైన సన్నబియ్యం అందిస్తున్నామని తెలిపారు.