
కారు, లారీ ఢీ.. ముగ్గురు మృతి (వీడియో)
AP: విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డులో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గొల్లపూడి ఫ్లైఓవర్ సమీపంలో ముందు వెళ్తున్న కారును అత్యంత వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. గుంటూరు జిల్లా చిలుకలూరిపేట నుంచి విజయవాడ గొల్లపూడి వైపు వస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఈ ప్రమాదంలో మృతి చెందారు. ప్రమాద తీవ్రతకు కారు నుజ్జునుజ్జయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.




