TG: రాహుల్‌ది కుటుంబ పరిరక్షణ యాత్రని
బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. 'దొంగ ఓట్లు తొలగిస్తే కాంగ్రెస్‌కు భయమెందుకు. SIR ప్రక్రియ కొత్తది కాదు. ఫిరాయింపులపై రాహుల్ ఎందుకు మౌనంగా ఉన్నారు. రాహుల్, రేవంత్ కొత్త రాజ్యాంగం రాస్తున్నారా? EVMలపై కాంగ్రెస్‌ది ద్వంద్వ వైఖరి' అని విమర్శించారు.