TG: తెలంగాణలో రైల్వే ప్రాజెక్టుల కోసం ఇంకా 764 హెక్టార్ల భూసేకరణ జరగాల్సి ఉందని, దీనివల్ల పనులు ఆలస్యమవుతున్నాయని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ లోక్సభలో తెలిపారు. ముఖ్యంగా మనోహరాబాద్-కొత్తపల్లి, కాజీపేట-విజయవాడ లైన్లలో భూసేకరణ పెండింగ్‌లో ఉందని, రాష్ట్రానికి రూ.35,045 కోట్ల విలువైన 20 రైల్వే ప్రాజెక్టులు మంజూరయ్యాయని ఆయన వెల్లడించారు. ఎంపీ ఈటల రాజేందర్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి రాతపూర్వకంగా ఈ సమాధానం ఇచ్చారు.