శ్రీవాస్తవ మల్ఖేడ్‌లోని సిమెంట్ సైడింగ్‌ను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శనివారం తనిఖీ చేశారు. గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ (జీపీఆర్) అమర్చిన కోచ్‌లో ప్రయాణించి, ట్రాక్ కింద ఉన్న పొరలను స్కాన్ చేసి ట్రాక్ భద్రతను అంచనా వేసే అత్యాధునిక వ్యవస్థను ఆయన పరిశీలించారు. ఈ సాంకేతికతతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగకుండా ట్రాక్ భద్రతను సమర్థవంతంగా పరిశీలించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ రైల్వే అధికారులు పాల్గొన్నారు.