దసరా, దీపావళి పండుగల సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వేశాఖ 100 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ రైళ్లు అక్టోబర్, నవంబర్ నెలల్లో ఏపీ, తెలంగాణ, తమిళనాడు, అస్సాం, ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, యూపీ, బీహార్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లోని పలు కీలక మార్గాల్లో నడుస్తాయి. కాన్పూర్-బెంగళూరు, కాన్పూర్-మదురై, విశాఖపట్నం-బెంగళూరు, షాలిమార్-చర్లపల్లి వంటి మార్గాల్లో ఈ ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయి. కొన్ని రైళ్లు సెప్టెంబర్ 19 నుంచే ప్రారంభమయ్యాయి.