
గూగుల్ ఉద్యోగులకు స్వచ్ఛంద నిష్క్రమణ ఆఫర్
గూగుల్ తన గ్లోబల్ బిజినెస్ ఆర్గనైజేషన్ (GBO) విభాగంలోని ఉద్యోగులకు 'స్వచ్ఛంద విరమణ ఆఫర్' (Voluntary Exit Program) ప్రకటించింది. కంపెనీ వేగంతో పోటీ పడలేమని భావించేవారు. బయటకు వెళ్లాలనుకునేవారు గౌరవప్రదమైన సెవరెన్స్ ప్యాకేజీతో నిష్క్రమించవచ్చని చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ఫిలిప్ షిండ్లర్ మెమో ద్వారా తెలిపారు. ఈ ఆఫర్ అమెరికాలోని GBOలోని సొల్యూషన్స్ టీమ్‌లు, సేల్స్, కార్పొరేట్ డెవలప్‌మెంట్ వంటి విభాగాలకు వర్తిస్తుంది. కస్టమర్లతో నేరుగా సంబంధం ఉండే సేల్స్ బృందాలకు ఇది వర్తించదు. ఏఐ ప్రాధాన్యత పెరగడంతో గూగుల్ తన మానవ వనరులను తీర్చిదిద్దుకునే పనిలో భాగంగా ఈ చర్య తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.




