
విజయ్ కుమార్ మల్హోత్రాకు నివాళులు అర్పించిన రాష్ట్రపతి ముర్ము
బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ విజయ్ కుమార్ మల్హోత్రా (94) మృతికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతాపం తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం రాష్ట్రపతి ముర్ము మల్హోత్రా నివాసానికి వెళ్లి, ఆయన పార్థివదేహాన్ని సందర్శించి, నివాళులు అర్పించారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మల్హోత్రా ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన ఐదుసార్లు ఎంపీగా, రెండుసార్లు ఢిల్లీ ఎమ్మెల్యేగా, రెండుసార్లు ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు.




