తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజాగా వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతాయని పేర్కొంది. రానున్న 2 గంటల్లో ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, ములుగు, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. గంటకు 30-40 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందంది.