గత కొద్ది రోజులుగా అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడుతున్న హైదరాబాద్ ప్రజలకు తెలంగాణ వాతావరణ శాఖ భారీ వర్ష సూచనతో ఊరటనిచ్చింది. రానున్న గంటలో నగరంలోని పలు ప్రాంతాల్లో, ముఖ్యంగా వెస్ట్ హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్ పరిసరాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. శేరిలింగంపల్లి, గచ్చిబౌలి, మియాపూర్, మాధాపూర్, కూకట్‌పల్లి, రాయదుర్గం, కొండాపూర్, హఫీజ్‌పేట్, తెల్లాపూర్, నానక్‌రామ్‌గూడ వంటి ప్రాంతాల్లో తీవ్రమైన ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.