
పెళ్లికి వారం ముందు విషాదం.. గోదావరిలో కొట్టుకుపోయిన ప్రేమ జంట
TG: పెద్దపల్లి జిల్లాలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. పెద్దలను ఒప్పించి మరో వారం రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్న ప్రేమ జంట గోదావరి నదిలో కొట్టుకుపోయింది. నవంబర్ 1న పెళ్లి నిశ్చయించుకున్న ఈ జంట కుటుంబీకులతో పుణ్యస్నానాలకు గోదావరిఖని సమ్మక్క సారాలమ్మ పుష్కర ఘాట్ వద్దకు వచ్చారు. నదిలో స్నానం చేస్తుండగా కొట్టుకుపోయారు. గమనించిన జాలరులు యువకుడిని కాపాడి యువతి మృతదేహాన్ని వెలికితీశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




