తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వర్ష సూచన చేసింది. ఇవాళ అర్ధరాత్రి ఒంటి గంటలోపు రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షం కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించింది. ఈ మేరకు జగిత్యాల, కామారెడ్డి, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, ములుగు, నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల, సంగారెడ్డి, వికారాబాద్, వరంగల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.