కాసేపట్లో ఈ జిల్లాల్లో వర్షం(వీడియో)

36చూసినవారు
ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ మేరకు TGలోని నిజామాబాద్ నగరంలో భారీ వర్షం దంచికొడుతోంది. అటు హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో పలు కాలనీలు జలమయమయ్యాయి. కాసేపట్లో మెదక్, సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. అటు ఏపీలోని విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి.