తెలంగాణలో మళ్లీ వర్షాలు

16844చూసినవారు
తెలంగాణలో మళ్లీ వర్షాలు
తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతోంది. సాయంత్రం 5-6 గంటల తర్వాత రాష్ట్రం మొత్తం చలితో వణికిపోతోంది. ఈ నేపథ్యంలో, భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలంగాణకు మరో హెచ్చరిక జారీ చేసింది. ఈ నెల 29 నుంచి రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని, 30న కొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. దీంతో భద్రాద్రి జిల్లా, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.

సంబంధిత పోస్ట్