తెలంగాణలో వారం రోజులపాటు వానలు.. 24 జిల్లాలకు ఎల్లో అలర్ట్

3751చూసినవారు
తెలంగాణలో వారం రోజులపాటు వానలు.. 24 జిల్లాలకు ఎల్లో అలర్ట్
తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో మరో వారం రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఇది మరింత విస్తరించే అవకాశం ఉందని తెలిపింది. ప్రస్తుతం అండమాన్ సముద్రంలో అల్పపీడనం కొనసాగుతోందని, ఇది బలపడి సెప్టెంబర్ 21న వాయుగుండంగా, 22న తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందంది. దీంతో ఈ నెల 25 వరకు భారీ వర్షాలు, అక్కడక్కడ అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పింది. ఈ మేరకు ఆదివారం 24 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్