తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు

7చూసినవారు
తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు
తెలంగాణలోని పలు జిల్లాల్లో ఆదివారం వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. ఉత్తర, తూర్పు జిల్లాలైన ADLB, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. మిగిలిన దక్షిణ, పశ్చిమ జిల్లాల్లో పొడి వాతావరణం కొనసాగనుందని, అక్కడక్కడా చిరుజల్లులు పడే అవకాశముందని అధికారులు తెలిపారు. హైదరాబాద్, శివారు ప్రాంతాల్లో నేడు ఆకాశం మేఘావృతమై ఉంటుందని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్