ఇవాళ రాత్రిలోపు తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు

16చూసినవారు
ఇవాళ రాత్రిలోపు తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు
TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళవారం మధ్యాహ్నం నుంచి రాత్రి లోపు ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. నల్గొండ, యాదాద్రి, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, మహబూబ్‌నగర్, గద్వాల, వికారాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, జనగాం, హన్మకొండ, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో పాటు వడగళ్ల వాన కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ వాసులకు కూడా రాత్రి లోపు మోస్తరు నుంచి భారీ ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్