తెలంగాణలో వానలు.. ఈ 4 రోజులు జాగ్రత్త

28చూసినవారు
తెలంగాణలో వానలు.. ఈ 4 రోజులు జాగ్రత్త
బంగాళాఖాతంలో ఏర్పడిన బలమైన అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో వచ్చే నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. గంటకు 50-60 కి.మీ వేగంతో ఈదురుగాలులు, ఉరుములు, పిడుగులు సంభవించే అవకాశం ఉందని తెలిపింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని, వాగులు, వంకల వద్దకు వెళ్లొద్దని సూచించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్