తెలంగాణలో రాబోయే నాలుగు రోజులు వర్షాలు!

63చూసినవారు
తెలంగాణలో రాబోయే నాలుగు రోజులు వర్షాలు!
TG: రాష్ట్రంలో రాబోయే నాలుగు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇవాళ కూడా కొన్ని చోట్ల భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతాయంది. రైతులు పొలాల దగ్గర తగిన జాగ్రత్తలు తీసుకోవాలంది.