తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్ మ్యాన్ బాలాజీ తెలిపారు. రేపు, ఎల్లుండి నార్త్, సౌత్, ఈస్ట్ జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయని ఆయన సూచించారు. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కామారెడ్డి, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, మహబూబ్‌నగర్, వనపర్తి, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ వంటి పలు జిల్లాలు ఈ జాబితాలో ఉన్నాయన్నారు.