తెలంగాణలో ఒకవైపు ఎండలు మండుతుండగా.. మరోవైపు వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణకు HYD వాతావరణ కేంద్రం హెచ్చరికలు చేసింది. రాబోయే 2-3 గంటల్లో నాగర్ కర్నూల్, నల్గొండ, NZB, రాజన్న సిరిసిల్ల, SDPT, భద్రాద్రి కొత్తగూడెం, HYD, జనగాం, కామారెడ్డి, యాదాద్రి, గద్వాల్, MBNR, నారాయణపేట, RR, కరీంనగర్, KMM, MBBD, మెదక్, మేడ్చల్, సూర్యాపేట, WGL, SRD, VKB, వనపర్తి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.