తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. రాయలసీమ, హైదరాబాద్ ప్రాంతాల్లో అర్ధరాత్రి నుంచి రేపు ఉదయం వరకు వర్షాలు కురుస్తాయని తెలిపారు. అటు అనంతపురం, సత్యసాయి, కర్నూలు జిల్లాల్లో రాబోయే 2-3 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. తెలంగాణలోని కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే వానలు పడుతున్నాయి.