రాయ్‌పూర్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ బ్యాటర్లు చెలరేగారు. దీంతో టీం ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 358 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో రుతురాజ్ గైక్వాడ్(105), విరాట్ కోహ్లీ(102) శతకాలతో రాణించారు. KL రాహుల్ 66 పరుగులు చేసి కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు. సౌత్ ఆఫ్రికా లక్ష్యం 359 రన్స్.