బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని రేపు ప్రతి గ్రామం, పట్టణం, నియోజకవర్గం, జిల్లా కేంద్రాల్లో పార్టీ జెండాలను ఎగురవేయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. పార్టీ శ్రేణులతో కేటీఆర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ.. రేపు (ఏప్రిల్ 27న) తెలంగాణ భవన్‌లో రాష్ట్ర స్థాయి ప్రతినిధుల సమావేశం జరుగుతుందని తెలిపారు. ప్రస్తుత ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కేసీఆర్ ఆదేశాల మేరకు ఈసారి ప్లీనరీని కేవలం రాష్ట్ర కార్యవర్గ సమావేశానికే పరిమితం చేసినట్లు కేటీఆర్ తెలిపారు.