
ట్రంప్ సంతకంతో అమెరికాలో ముగిసిన షట్డౌన్ (VIDEO)
అమెరికా చరిత్రలో అత్యంత కాలం కొనసాగిన ఆర్థిక షట్డౌన్కు తెరపడింది. ప్రభుత్వ ఫండింగ్ బిల్లుపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం రాత్రి సంతకం చేయడంతో 43 రోజులుగా కొనసాగిన షట్డౌన్ అధికారికంగా ముగిసింది. అంతకుముందు ప్రతినిధుల సభలో ఈ బిల్లు 222-209 ఓట్ల తేడాతో ఆమోదం పొందింది. దీంతో ప్రభుత్వ కార్యకలాపాలు తిరిగి ప్రారంభం కానున్నాయి.




