'బాహుబలి - ది బిగినింగ్' విడుదలైన రోజున వచ్చిన టాక్ విని తాను చాలా నిరాశకు గురయ్యానని దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి స్వయంగా వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల నుంచే ప్రధాన ఆదాయం వస్తుందని భావించినా తొలి షో నుంచే నెగెటివ్ టాక్ వచ్చిందని, ఇది ఇండస్ట్రీలోనే అతిపెద్ద ఫ్లాప్ అని ప్రచారం జరిగిందని తెలిపారు. నిర్మాతలు, తనపై నమ్మకం ఉంచి మూడేళ్లుగా పనిచేస్తూ భారీగా ఖర్చు చేసిన వారిని ఎలా బయటకు తీసుకురావాలో తెలియక బాధపడ్డానని అన్నారు.