
VIDEO: ఐటీ ఉద్యోగం వదిలి రాపిడో ఆటో నడుపుతున్న మహిళా టెకీ
బెంగళూరుకు చెందిన మాజీ ఐటీ ఉద్యోగిని, తన తండ్రి మరణం తర్వాత కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలి రాపిడో ఆటో నడపడం ప్రారంభించింది. రాత్రిపూట షిఫ్టులు చేస్తూ తల్లికి అండగా ఉండటం కష్టంగా మారడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపింది. ఆటో డ్రైవర్గా సమయంపై నియంత్రణతో పాటు ఇంటికి దగ్గరగా ఉండేలా చూసుకోగలుగుతున్నానని, అంతేకాకుండా ఎక్కువ సంపాదిస్తున్నానని ఆమె వెల్లడించింది. ఆమె ధైర్యాన్ని, స్వేచ్ఛను ఎంచుకున్న తీరును నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.




