IPL-2026 క్వాలిఫయర్ 2లో రాజస్థాన్ రాయల్స్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. గుజరాత్ బౌలర్ల ధాటికి రాజస్థాన్ 2 వికెట్లను కోల్పోయింది. సిరాజ్ వేసిన తొలి ఓవర్‌లో ఓపెనర్ యశస్వి జైశ్వాల్ (1) వెనుదిరగ్గా, రబాడ వేసిన రెండో ఓవర్‌లో ధ్రువ్ జురెల్ (7) ఔట్ అయ్యాడు. దీంతో 2 ఓవర్లలోనే రాజస్థాన్ రెండు కీలక బ్యాటర్లను కోల్పోయింది. ప్రస్తుతం 2 ఓవర్లు ముగిసే సమయానికి రాజస్థాన్ 13/2గా ఉంది. క్రీజులో వైభవ్ సూర్యవంశీ (3), జడేజా (4) ఉన్నారు.