
ప్రాణ భయంతో పరుగులు.. వీడియో వైరల్
ఫిలిప్పీన్స్‌లోని మిండనోవా ద్వీపంలో శుక్రవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 7.6 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం కారణంగా భవనాలు కొన్ని సెకన్ల పాటు కదిలాయి. దీంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని భయాందోళనతో ప్రజలు ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. కొన్ని చోట్ల ఇళ్లు ఊగిపోవడంతో కేకలు వేశారు. ఈ క్షణం బతికితే చాలు దేవుడా అనుకుంటూ తమ ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేశారు. ఈ వీడియో తాజా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.




