రజనీకాంత్ కెరీర్‌లోని బ్లాక్‌బస్టర్ చిత్రం 'నరసింహ'కు సీక్వెల్ రానుందని అధికారికంగా ప్రకటించారు. 'నీలాంబరి' అనే టైటిల్‌తో రానున్న ఈ చిత్రానికి సంబంధించిన కథా చర్చలు జరుగుతున్నాయి. ఇక రజనీకాంత్ తన 75వ పుట్టినరోజు సందర్భంగా 'నరసింహ' చిత్రాన్ని రీ-రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన వీడియోలో రజిని సీక్వెల్ గురించి వెల్లడించారు. రమ్యకృష్ణ పోషించిన నీలాంబరి పాత్ర ఇప్పటికీ ట్రెండింగ్‌లో ఉంది.