నవంబర్ నుంచి 'రాజీవ్ యువ వికాసం': భట్టి

8చూసినవారు
నవంబర్ నుంచి 'రాజీవ్ యువ వికాసం': భట్టి
TG: రాష్ట్రంలోని బీసీ నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి కల్పించే లక్ష్యంతో రూపొందించిన 'రాజీవ్‌ యువ వికాసం' పథకాన్ని వచ్చే నవంబర్‌ నుంచి అమలు చేయనున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార తెలిపారు. దరఖాస్తులను జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో పారదర్శకంగా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ఈ స్కీమ్ ద్వారా యువత సొంతంగా వ్యాపారాలు చేసుకునేందుకు ప్రభుత్వం రూ.3 లక్షల వరకు లోన్ ఇస్తుంది. గరిష్ఠంగా 80-90% వరకు సబ్సిడీ పోనూ మిగతా మొత్తం లబ్ధిదారు చెల్లించాలి.

సంబంధిత పోస్ట్