
"అతనితో ఓ రాత్రి గడిపే ఛాన్స్ వస్తే మిస్ చేసుకోను"
బాలీవుడ్ నటి అమీషా పటేల్ తన వ్యక్తిగత విషయాలను నిర్భయంగా పంచుకుంటూ మరోసారి వార్తల్లో నిలిచింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన చిన్ననాటి క్రష్ హాలీవుడ్ స్టార్ టామ్ క్రూజ్ గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 'అతను పిలిస్తే ఎక్కడికైనా వెళ్తాను చివరికి ఒక రాత్రి తనతో గడపమన్నా ఆ అవకాశాన్ని మిస్ అవ్వను అని చెప్పింది. ఈమె తెలుగులో పవన్ కళ్యాణ్‌తో బద్రి, మహేష్ తో నాని, ఎన్టీఆర్‌తో నరసింహుడు వంటి చిత్రాల్లో నటించింది.




