ప్రధాని
మోదీ నివాసంలో
బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) సమావేశం జరిగింది. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ భేటీలో ఏపీ సహా 10 రాష్ట్రాల్లోని 24 రాజ్యసభ స్థానాల భర్తీకి సంబంధించి సుదీర్ఘంగా కసరత్తు నిర్వహించారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్‌నాథ్‌సింగ్, సీనియర్ నేత కె.లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రాల వారీగా పార్టీ అభ్యర్థుల విజయవకాశాలు, రాజకీయ సమీకరణాలపై
మోదీ, అమిత్‌షా ఆరా తీశారు.