తెలంగాణలో ఖాళీ అవుతున్న రెండు రాజ్యసభ సీట్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ చర్చలు మొదలు పెట్టింది. ఈ మేరకు పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో సోమవారం సీట్లు ఎవరికీ కేటాయించాలనే విషయంపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ ఆశించి టికెట్ రాకపోయినా పార్టీ గెలుపుకు కృషి చేసిన నేతలకు ఈ సీట్లు కేటాయించాలనే అంశంపై చర్చ జరిగింది. కాగా, రాజ్యసభ ఎంపీల రేసులో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మాజీ ఎంపీ వీహెచ్, బెల్లయ్య నాయక్, దొమ్మాటి సాంబయ్య పేర్లు ఈ సందర్భంగా చర్చకు వచ్చినట్లు తెలిసింది.