
వైభవ్‌పై అమితాబ్ ప్రశంసలు
ఐపీఎల్ రెండో క్వాలిఫయర్‌లో ఓడిపోయి రాజస్థాన్ రాయల్స్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 47 బంతుల్లో 96 పరుగులు చేసి అందరినీ ఆకట్టుకున్నాడు. అతని ఆటతీరును అభినందిస్తూ అగ్రనటుడు అమితాబ్ బచ్చన్ ఎక్స్ వేదికగా, 'నీ వయసులో మేం కనీసం గోళీలు, గల్లీ క్రికెట్ కూడా సరిగ్గా ఆడలేకపోయేవాళ్లం. నువ్వు మాత్రం నీ ఆటతో ఔరా అనిపించావు. నువ్వో అద్భుతానివి' అని ప్రశంసించారు.




